'మైలవరంలో మట్టి మాఫియా అరాచకం': విద్యుత్ వైర్ తగిలి లారీ దగ్ధం
రిపోర్టర్: సతీష్
స్థలం: మైలవరం
ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం కొత్తూరు తాడేపల్లి గ్రామంలో అధికార పార్టీ నేతల అండతో సాగుతున్న మట్టి మాఫియా అరాచకాలు బట్టబయలయ్యాయి. హెవీ లోడ్‌తో వెళ్తున్న మట్టి లారీకి 11 కేవీ విద్యుత్ వైర్ తగలడంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగి లారీ పూర్తిగా దగ్ధమైంది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై అధికార పార్టీ నేతల అక్రమ మైనింగ్ దందాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.