సీతమ్మలోద్ది వారసత్వాన్ని కాపాడేందుకు కదంతొక్కిన వందలాది మంది యువకులు
రిపోర్టర్: T. SRAVAN
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లాలోని సీతమ్మలోద్ది చారిత్రక వారసత్వ సంపదను పరిరక్షించి భావితరాలకు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కోరారు. సీతమ్మలోద్ది హెరిటేజ్ ట్రెక్కింగ్‌లో వందలాది మంది యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గుహలో లభించిన ప్రాచీన గ్రైండింగ్ పరికరాన్ని మ్యూజియంలో భద్రపరిచారు. ఈ కార్యక్రమం పర్యాటక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.