ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కైవసం చేసుకున్న అండర్ 19 భారత జట్టు

రిపోర్టర్: మహేష్ స్థలం: రాజ్‌కోట్

రాజ్‌కోట్‌లో ఆస్ట్రేలియా అండర్ 19 జట్టుతో జరిగిన రెండో యూత్ వన్డేలో భారత్ 103 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. యశ్‌వర్ధన్ సింగ్ చౌహాన్ అద్భుతమైన సెంచరీ (122 పరుగులు) సాధించగా, వి.కె. వినీత్ (87) రాణించారు. దీంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 341 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియాను 238 పరుగులకే కట్టడి చేసి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది.