దినదినం పెరుగుతున్న బెంగళూరు దొడ్డ గణపతి మహిమ
రిపోర్టర్: సునీల్
స్థలం: కర్ణాటక
కర్ణాటక రాజధాని బెంగళూరులో కొలువైన దొడ్డ గణపతి విగ్రహం దినదినానికి పరిమాణంలో పెరుగుతుండటం భక్తులను ఆశ్చర్యపరుస్తోంది. 18 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు కలిగిన ఈ ఏకశిలా విగ్రహాన్ని సత్య, శక్తి గణపతిగా భక్తులు కొలుస్తారు. వినాయక చవితి వేడుకల సమయంలో ఈ క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారికి వెన్నతో ప్రత్యేక అలంకరణలు చేస్తూ పూజలు నిర్వహిస్తారు.