తాజ్ మహల్ వద్ద విదేశీ మహిళను చుట్టుముట్టిన గుంపు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: ఉత్తరప్రదేశ్
తాజ్ మహల్ సందర్శనకు వచ్చిన విదేశీ మహిళను కొద్దిమంది వ్యక్తులు చుట్టుముట్టి అసౌకర్యానికి గురిచేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె ఫొటోలు దిగుతుండగా గుంపుగా చేరి ఇబ్బంది పెట్టిన వైనాన్ని గమనించిన ఓ ఫొటోగ్రాఫర్, వెంటనే స్పందించి వారిని హెచ్చరించారు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ పర్యాటకుల పట్ల సివిక్ సెన్స్, మర్యాద పాటించాలని కామెంట్లు చేస్తున్నారు.