అన్నదాతల ఆక్రోశం: దోమపోటు తెగులతో వరి పంటను తగలబెట్టిన రైతు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: కామారెడ్డి
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలో దోమపోటు తెగులు సోకిన సన్న రకం వరి పంటను వెంకట్రాములు అనే రైతు డీజిల్ పోసి తగలబెట్టినట్లు తెలిపారు. ఎంత ప్రయత్నించినా తెగులు అదుపులోకి రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మారిన వాతావరణ పరిస్థితులతో వ్యవసాయం పూర్తిగా ప్రాణాంతక జూదంగా మారిందని, పెట్టుబడులు దెబ్బతిని అన్నదాతలు తీవ్ర దినావస్థలో కొట్టుమిట్టాడుతున్నారని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.