విశాఖలో విద్యార్థులకు భద్రతపై అవగాహన కల్పించిన పోలీస్ శాఖ

రిపోర్టర్: కిరణ్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం నగరంలో పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్, హ్యూమన్ ట్రాఫికింగ్, బాల్య వివాహాలపై విద్యార్థులకు పోలీసులు కీలక సూచనలు చేశారు. ఏపీ పోలీస్ 100 యాప్ వినియోగం, మహిళా రక్షణ చట్టాలపై విస్తృత ప్రచారం కల్పించారు.