కాగజ్ నగర్ లో ఇంటికి వచ్చిన అరుదైన నక్షత్ర తాబేలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Kumuram Bheem Asifabad
కాగజ్నగర్ మండలంలోని మూడో నెంబర్ ప్రాంతంలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి మనీష్ నివాసంలోకి ఓ అరుదైన నక్షత్ర తాబేలు కొట్టుకువచ్చిందని స్థానికులు తెలిపారు. గమనించిన ఇంటి సభ్యులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో, రేంజ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు వేంపల్లి సెక్షన్ ఆఫీసర్ శశిధర్ బాబు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. తాబేలును సురక్షితంగా స్వాధీనం చేసుకుని ఇస్గాం అటవీ ప్రాంతంలో విడిచిపెట్టామని అధికారులు పేర్కొన్నారు.