'30 రోజుల్లోగా 22ఏ ఆస్తుల సమస్యలకు పరిష్కారం': సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Hyderabad
రాష్ట్రంలో 22-ఏ నిషేధిత జాబితాలో నిరుపేదల ఆస్తులకు సంబంధించి నెలకొన్న సమస్యలను 30 రోజుల్లోగా పరిష్కరించి న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా స్పష్టం చేశారు. ఈ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం సీసీఎల్ఏ ప్రత్యేక కార్యదర్శి, న్యాయ శాఖ అధికారులతో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి సత్వర చర్యలు తీసుకోనున్నట్లు సీఎం సభలో ప్రకటించారు.