ఫ్రాన్స్‌లో తీవ్ర ఉద్రిక్తత: పారిస్ వీధుల్లో భయానక వాతావరణం సృష్టించిన నిరసనలు
రిపోర్టర్: అశోక్
స్థలం: Paris
ఫ్రాన్స్‌లో జరుగుతున్న హింసాత్మక నిరసనలు పర్యాటకులను భయాందోళనకు గురి చేస్తున్నాయని పారిస్‌లో పర్యటిస్తున్న శివశంకరి యోగానందనే అనే పర్యాటకురాలు తెలిపారు. జీవన వ్యయం పెరుగుదల మరియు రాజకీయ కారణాలపై దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతమయ్యాయని, లిమోగెస్ నగరంలో చారిత్రాత్మక టౌన్ హాల్ అగ్నికి ఆహుతైందని అధికారులు వెల్లడించారు. ఈ అశాంతి నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారుల ఆదేశాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.