జీవిత వ్యయంపై చర్చ: నెలవారీ కిరాణా ఖర్చులపై రామ్శ్రీ గౌతమ్ పోస్ట్ వైరల్

రిపోర్టర్: వెంకట్ స్థలం: Hyderabad

నెలవారీ కిరాణా ఖర్చులంటూ హైదరాబాద్కు చెందిన పారిశ్రామికవేత్త రామ్శ్రీ గౌతమ్ గోల్లా సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్ తీవ్ర చర్చకు దారితీసింది. తన నలుగురి కుటుంబానికి నెలకు ఎనభై వేల రూపాయల వరకు ఖర్చవుతోందని ఆయన తెలిపారు. ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలున్న తమ కుటుంబంలో ప్రతిరోజూ ఇంట్లోనే వంట చేసుకుంటున్నా ఈ స్థాయిలో ఖర్చు కావడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు విమర్శించగా, మరికొందరు నాణ్యమైన ఆహారానికి ఆ మాత్రం ఖర్చు తప్పదని సమర్ధిస్తున్నారు.