అత్యాచార దోషి జీవిత ఖైదు తీర్పును సమర్థించిన ఢిల్లీ హైకోర్టు
రిపోర్టర్: శివ
స్థలం: New Delhi
అత్యాచార కేసులో దోషికి విధించిన జీవిత ఖైదు శిక్షను ఢిల్లీ హైకోర్టు సమర్థించిందని న్యాయవర్గాలు వెల్లడించాయి. బాధితురాలైన బాలిక ధైర్యాన్ని అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రజనీ రంగా ప్రశంసించారని జస్టిస్ ప్రతిభా ఎం సింగ్, జస్టిస్ దినేష్ భట్ ధర్మాసనం పేర్కొంది. దోషి సుమిత్ శాక్య దాఖలు చేసిన అప్పీల్‌ను కోర్టు కొట్టివేయడంతో పాటు, బాధితురాలి కుటుంబానికి పదిన్నర లక్షల రూపాయల పరిహారం అందించాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆదేశించింది.