జూరాల జలాల తరలింపుపై ఉమ్మడి పాలమూరులో తీవ్ర ఉద్రిక్తత
రిపోర్టర్: రాము
స్థలం: జోగులాంబ గద్వాల్ జిల్లా
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జూరాల ప్రాజెక్టు కింద పంటలు ఎండుపోతుంటే, ఏపీలోని కుప్పానికి మాత్రం కృష్ణా నీళ్లను తరలిస్తున్నారని మండిపడుతూ జోగులాంబ గద్వాల్ జిల్లా జూరాల ప్రాజెక్టు వద్ద రైతులు భారీ ఆందోళనకు దిగారు. సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులను పోలీసులు నందిమల్ల క్రాస్ రోడ్డు వద్ద అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.