అమెరికా రాజకీయాల్లో సమోసా కాకస్ భవిష్యత్తుపై తీవ్ర ఉత్కంఠ
రిపోర్టర్: హరి
స్థలం: Washington
అమెరికా కాంగ్రెస్లో భారతీయ మూలాలున్న నాయకుల అనధికారిక బృందమైన సమోసా కాకస్ భవిష్యత్తుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ బృందంలో సభ్యుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆరుగురు సభ్యులున్న ఈ బృందంలో రాజా కృష్ణమూర్తి, శ్రీ తనేదార్ నిష్క్రమించనున్నారు. దీంతో మిగిలిన నలుగురు తమ స్థానాలను నిలబెట్టుకోవడం మరియు కొత్త అభ్యర్థుల గెలుపుపై ఈ కూటమి కొనసాగింపు ఆధారపడి ఉందని సూర్య ప్రకాష్ జోశ్యుల వెల్లడించారు.