కడారిగూడెంలో రైతులకు ఉచితంగా ట్రైకోడెర్మా విరిడి పంపిణీ: అధికారులు
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామంలో రైతు పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ కేంద్ర సమగ్ర సస్యరక్షణ కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా ట్రైకోడెర్మా విరిడి పంపిణీ చేశారు. పంటల్లో సిలీంద్ర వ్యాధుల నివారణకు ఈ జీవ శిలీంద్ర నాశని ఎంతగానో ఉపయోగపడుతుందని ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ బసవన్నప్ప వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి శిల్పతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.