మంథనిలో వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాలు ఘనంగా ప్రారంభం
రిపోర్టర్: Subhan.Manthani
స్థలం: మంథని
మంథని ప్రణామ్ డే కేర్ సెంటర్ ఆవరణలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక సమావేశం మరియు ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ శ్రీనిజ కోయిర్కర్ ముఖ్య అతిథిగా హాజరై వయోవృద్ధుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య పరీక్షలతో పాటు ఉచిత మందులు పంపిణీ చేశారు.