ఉత్తరాఖండ్‌లో కలకలం: బద్రీనాథ్ వెళ్తూ అదృశ్యమైన ఆరుగురి హెలికాప్టర్
రిపోర్టర్: కిరణ్
స్థలం: చమోలి
లోని చమోలి జిల్లాలో ట్రాన్స్ భారత్ ఏవియేషన్ సంస్థకు చెందిన హెలికాప్టర్ అదృశ్యమైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. బద్రీనాథ్ నుంచి ఫాటాకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పైలట్‌తో సహా ఆరుగురు ప్రయాణికులు అందులో ఉన్నట్లు సమాచారం. జోషిమఠ్ సమీపంలో హెలికాప్టర్ కూలిపోయి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అదృశ్యమైన హెలికాప్టర్ ఆచూకీ కోసం మరో రెండు హెలికాప్టర్లతో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.