సిరిసిల్లలో దేశ సమగ్రత రక్షణకు ఐక్యతా ప్రతిజ్ఞ చేసిన పురపాలక సిబ్బంది
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: సిరిసిల్ల
భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల పురపాలక సంఘం కౌన్సిల్ హాల్లో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొని దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు అంకితభావంతో కృషి చేస్తామని దృఢ ప్రతిజ్ఞ చేశారు.