స్థానిక ఎన్నికలపై వైసీపీ కుట్రలు చేస్తున్నదంటూ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం
రిపోర్టర్: గోపి
స్థలం: Amaravati
స్థానిక ఎన్నికల నిర్వహణ ఇష్టం లేకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధ్వంసానికి పాల్పడుతోందని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఉండవల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికలను అడ్డుకుని రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులను నిలిపివేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. ఫేక్ ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని, వైసీపీ సిద్ధాంతం పూర్తిగా క్రిమినలైజేషన్ అని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు.