వన్యప్రాణులకు హాని తలపెడితే ఉపేక్షించేది లేదని కవ్వాల్ అధికారుల హెచ్చరిక
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
అడవులు వన్యప్రాణుల సంరక్షణతోనే భవిష్యత్తు ఉంటుందని కవ్వాల్ అటవీ అధికారులు తెలిపారు. ఆదివారం గ్రామస్తులకు కళాకారులు పాటల ద్వారా అవగాహన కల్పించారు. అడవుల్లో చెట్లు నరకడం నేరమని వన్యప్రాణులకు హాని కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అవగాహన పొందారు.