వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటుపై స్పష్టతనిచ్చిన గౌతమ్ గంభీర్
రిపోర్టర్: నరేష్
స్థలం: భారతదేశం
భారత టీ20 జట్టులో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కేందుకు మరికొంత సమయం పట్టనుందని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో సంజూ శాంసన్‌కు ప్రాధాన్యం ఇవ్వడం వల్లనే సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం రాలేదని తెలిపారు. ఆటగాడి వయసుతో సంబంధం లేకుండా జట్టు కాంబినేషన్, అనుభవానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని, వైభవ్ ప్రతిభపై తమకు పూర్తి నమ్మకం ఉందని గంభీర్ పేర్కొన్నారు.