బెంగళూరు విమానాశ్రయంలో దారుణం: శాఖాహార బిర్యానీలో చికెన్ ముక్కలు గుర్తించిన కుటుంబం
రిపోర్టర్: మహేష్
స్థలం: బెంగళూరు
శాఖాహార బిర్యానీలో చికెన్ ముక్కలు వచ్చిన ఘటన కలకలం రేపిందిని ప్రయాణికుడు పియూష్ అగర్వాల్ వెల్లడించారు. వారణాసికి చెందిన కుటుంబం బెంగళూరు విమానాశ్రయంలోని టెర్మినల్ ఒకటి వద్ద టేస్ట్ ఆఫ్ ఇండియా రెస్టారెంట్ లో శాఖాహార బిర్యానీ ఆర్డర్ చేశారు. అయితే ఆ వంటకంలో చికెన్ ముక్కలు ఉండటాన్ని గుర్తించి సిబ్బందిని నిలదీశారు. తమ మత విశ్వావసాలకు విరుద్ధంగా జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఎఫ్ ఎస్ ఎస్ ఏ ఐ అధికారులకు ఫిర్యాదు చేశారు.