తెలంగాణ బీజేపీ నేతలకు హైకమాండ్ వార్నింగ్: క్షేత్రస్థాయికి వెళ్లకపోతే పదవులు కట్

రిపోర్టర్: కిరణ్ స్థలం: Hyderabad

తెలంగాణ బీజేపీలో నేతల పనితీరుపై పార్టీ నూతన ఇంచార్జ్లు మధుకర్, అభయ్ పాటిల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఆఫీస్ బేరర్లు కేవలం హైదరాబాద్ కార్యాలయానికే పరిమితమైతే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. గ్రౌండ్ లెవెల్లో పనిచేయని వారికి భవిష్యత్తులో పదవులు దక్కవని, కష్టపడే వారికే తగిన గుర్తింపు ఉంటుందని తేల్చిచెప్పారు. ఇప్పటికైనా నాయకులు వైఖరి మార్చుకుని విధిగా జిల్లాల్లో పర్యటించాలని వారు స్పష్టం చేశారు.