నెల్లూరులో రూ.11,085 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు
రిపోర్టర్: గోపి
స్థలం: అనకాపల్లి
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారని వంగలపూడి అనిత అనకాపల్లి వెల్లడించారు. రూ.11,085 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు వారు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారని తెలిపారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పల్లె పండుగ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవుతుందని, గ్రామాల్లో అద్భుతమైన మార్పునకు నాంది పలుకుతున్నామని పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో రూ.7.80 కోట్ల వ్యయంతో ఆధునిక అగ్నిమాపక కేంద్రాలను ప్రారంభించినట్లు ఆమె వివరించారు.