రాజాపేటలో రైతుల ఇబ్బందులు తీర్చేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం సర్పంచ్ కోయ మధు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రేణికుంట పిఎసిఎస్ చైర్మన్ నమిల మహేందర్ గౌడ్, ఉప సర్పంచ్ నమిల కేదారి గౌడ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.