ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వాతావరణ మార్పులు: సీఎస్ సంజయ్ జాజు హెచ్చరిక

రిపోర్టర్: రాజేష్ స్థలం: సంగారెడ్డి

తెలంగాణలో ఎల్నినో ప్రభావం తీవ్రరూపం దాల్చుతోందని, 2027 ఫిబ్రవరి నాటికి ఇది మరింత పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు. ఈ వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు జలాశయాన్ని గురువారం ఆయన పరిశీలించారు. రాబోయే పదిహేను రోజులు వ్యవసాయ రంగానికి చాలా కీలకమని పేర్కొంటూ, పంటలు మరియు తాగునీటి లభ్యతపై అధికారులతో చర్చించారు.