జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ బొబ్బిలిలో ఘనంగా నిరసన ప్రదర్శన

రిపోర్టర్: GANESH BBL స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలిలో వర్కింగ్ జర్నలిస్టుల కోరికల దినం సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే బేబీనాయనకు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.