బొబ్బిలి మల్లంపేటలో బ్రహ్మాకుమారీస్ ఆధ్వర్యంలో చైతన్య దుర్గామాతల ప్రదర్శన

రిపోర్టర్: GANESH BBL స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని మల్లంపేటలో దేవీ నవరాత్రుల సందర్భంగా బ్రహ్మాకుమారీస్ ఆధ్వర్యంలో చైతన్య దుర్గామాతల ప్రదర్శన నిర్వహించారు. కన్యలను వివిధ దేవతామూర్తుల రూపాల్లో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా బ్రహ్మాకుమారీస్ కేంద్రం ఇన్ఛార్జి బీ కే రాజేశ్వరి మాట్లాడుతూ, దసరా ఉత్సవాలు మనలోని చెడు గుణాలను తొలగించుకొని సద్గుణాలను అలవర్చుకోవాలని సందేశాన్నిస్తాయని పేర్కొన్నారు. అంతర్గత శత్రువులను జయించడంలో రాజయోగ ధ్యానం ఎంతగానో దోహదపడుతుందని వివరించారు.