కావలిలో సబ్సిడీ బియ్యం విక్రయం: కిలో నలభై తొమ్మిది రూపాయలకే పంపిణీ

రిపోర్టర్: రమేష్ స్థలం: కావలి

బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో సన్న రకాలను కిలో నలభై తొమ్మిది రూపాయలకే అందజేస్తున్నట్లు జిల్లా పౌర సరఫరాల సంస్థ డిపో మేనేజర్ కే. శ్రీనివాసరావు తెలిపారు. కావలి రైతు బజార్లో సబ్సిడీ బియ్యం విక్రయాలను ఆయన ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డును సమర్పించి ఇరవై ఐదు కిలోల బస్తాను పొందవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు బజార్ ఈవో మధుబాబుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.