విజయవాడ భవానీపురంలో భారీ అగ్నిప్రమాదం మరియు ఎగిసిపడిన మంటలు

రిపోర్టర్: రాము స్థలం: విజయవాడ

విజయవాడ భవానీపురం పరిధిలో రెండవ అంతస్తులో హఠాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భవనంలో దట్టమైన పొగలు, మంటలు ఎగిసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరిగిన కొద్దిసేపటికే ఈ ఘటన జరగడంతో షార్ట్ సర్క్యూట్ లేదా ఏసీ పేలి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.