'మహిళా ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే ఎలా?': కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: రాజేష్
స్థలం: Hyderabad
ఇందిరామ్మ రాజ్యంలో మహిళా ఎమ్మెల్యేలకు కూడా రక్షణ లేకుండా పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రులు దుర్యోధన, దుశ్శాసనుల్లా మారుంటే... కాంగ్రెస్ పోలీసులు మహిళా ఎమ్మెల్యేలపై దౌర్జన్యానికి పాల్పడటం సహజమేనని విమర్శించారు. తెలంగాణలో మహిళా ప్రజాప్రతినిధులపై పోలీసుల తీరును ఆయన తీవ్రంగా ఖండించారు.