విశాఖ దక్షిణంలో వైఎస్ఆర్సీపీ గెలుపు తథ్యమన్న మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో వార్డులను ఎన్ని ముక్కలు చేసినా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తిరుగులేని విజయం సాధిస్తుందని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. నగరంలో వర్షాన్ని లెక్కచేయకుండా పలు వార్డులలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనతో ప్రజలు విసిగిపోయారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కోసం ఎదురుచూస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.