తీవ్ర తుపాను ప్రభావం: శంషాబాద్ విమానాశ్రయంలో పదమూడు విమానాలు రద్దు
రిపోర్టర్: మహేష్
స్థలం: రంగారెడ్డి
అర్నాబ్ తీవ్ర తుపాను ప్రభావంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆంధ్రప్రదేశ్ నగరాలకు వెళ్లాల్సిన పదమూడు విమాన సర్వీసులు రద్దయినట్లు అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం, బలమైన ఈదురుగాలుల కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇండిగో మరియు ఎయిర్ ఇండియా సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయని వెల్లడించారు. విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం వైపు వెళ్లే ప్రయాణికులు ఇంటి నుంచి బయలుదేరే ముందు విమాన సర్వీళ్ల వివరాలను పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు.