ఎలాన్ మస్క్ నష్టపోవడంపై ఆనందంగా ఉందన్న ఇల్లినాయిస్ గవర్నర్ ప్రిట్జ్కర్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ఇల్లినాయిస్

టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఐదు వందల మిలియన్ డాలర్ల నష్టపోవడంపై తాను సంతోషిస్తున్నానని ఇల్లినాయిస్ గవర్నర్ జెబి ప్రిట్జ్కర్ స్పష్టం చేశారు. అమెరికన్ ప్రోగ్రెస్ యాక్షన్ సమావేశంలో నీరా టాండన్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు బదులిచ్చారు. మస్క్ నష్టంపై డెమోక్రాట్ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అమెరికా రాజకీయాల్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.