ప్రజా సేవలో కూటమి ప్రభుత్వ పాలన అంకితభావం కొట్టవచ్చినట్లు కనిపిస్తోందంటూ రామ్మోహన్ నాయుడు ప్రశంస

రిపోర్టర్: నరేష్ స్థలం: శ్రీకాకుళం

ప్రతి నేత, ప్రతి శాఖ, ప్రతి విభాగం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, ప్రభుత్వ పథకాలను అర్హులైన చివరి వ్యక్తి వరకు చేర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. పెదలతో సేవలొ 2.0 కార్యక్రమం ద్వారా అన్ని శాఖల యంత్రాంగం సంక్షేమ ఫలాలను ప్రజలకు వేగంగా అందిస్తోందని ఆయన తెలిపారు.