వాహన బీమా వివాదం: బాధితుడికి మూడున్నర లక్షలు చెల్లించాలని కన్స్యూమర్ కమిషన్ ఆదేశం
రిపోర్టర్: వెంకట్
స్థలం: Hoshiarpur
మహీంద్రా బొలెరో వాహనం చోరీకి గురైన ఘటనలో బీమా సంస్థ తీరుపై పంజాబ్ లోని హోషియార్పూర్ జిల్లా కన్స్యూమర్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రీమియం చెల్లించినప్పటికీ దొంగతనం జరిగిన తర్వాత పాలసీ జారీ అయిందనే సాకుతో క్లెయిమ్ తిరస్కరించడానికి వీలేదని స్పష్టం చేసింది. బాధితుడు జతిందర్ కుమార్ కు మూడున్నర లక్షల రూపాయల పరిహారంతో పాటు సేవాలోపానికి పాల్పడినందుకు నష్టపరిహారం చెల్లించాలని బీమా కంపెనీని ఆదేశించినట్లు అధ్యక్షులు నవీన్ పూరి వెల్లడించారు.