వెలిగొండ ప్రాజెక్టు వద్ద సందర్శకుల సందడి.

రిపోర్టర్: హరి స్థలం: ప్రకాశం

వరుస సెలవుల నేపథ్యంలో మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి విపరీతంగా పెరిగింది. ప్రకృతి అందాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో టూరిస్టులు తరలివచ్చారు. ప్రాజెక్ట్ ప్రాంతం పర్యాటకులతో కిటకిటలాడింది.