పాశాలల అభివృద్ధిపై మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు

రిపోర్టర్: నరేష్ స్థలం: అమరావతి

పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఏడాదిలోగా వన్-స్టార్ పాఠశాలలన్నింటినీ టూ-స్టార్ స్థాయికి అప్గ్రేడ్ చేయాలని ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసంలో సోమవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆయన మాట్లాడుతూ, 2029 నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను నాలుగు-స్టార్ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు.