సూర్యాపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, కారు దగ్ధమై వైద్యుడు సజీవదహనం

రిపోర్టర్: రాము స్థలం: సూర్యాపేట

సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారిపై పిల్లలమర్రి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఖమ్మం మమత ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ కాసకుర్తి జగదీష్ ప్రయాణిస్తున్న వోల్వో కారు డివైడర్‌ను ఢీకొట్టి అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో సజీవదహనమయ్యారు. క్షణాల్లోనే మంటలు కారును చుట్టుముట్టడంతో ఆయన లోపల చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయవిదారక ఘటనతో ఖమ్మం వైద్య వర్గాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.