కోతుల బీభత్సం: జన్నారం కాలనీల్లో దాడిలో పది మందికి గాయాలు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం పట్టణంలోని పలు కాలనీల్లో కోతుల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. రాంనగర్, వినాయక్ నగర్, ఎన్టీఆర్ నగర్, శ్రీలంక బస్టాండ్ ఏరియా, అంగడి బజార్ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన కోతుల దాడిలో పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు సకాలంలో ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని యాంటీ రేబీస్ టీకాలు తీసుకోవడంతో ప్రాణాపాయ ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు.