మలేరియా కేసుల నియంత్రణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్న చక్రధర్‌బాబు
రిపోర్టర్: గోపి
స్థలం: అమరావతి
రాష్ట్రంలో మలేరియా కేసుల నియంత్రణలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం సహించేది లేదని, ఒక్క మరణానికీ ఆస్కారం ఇవ్వొద్దని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కేవీఎన్ చక్రధర్‌బాబు స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యశాలలో ఆయన మాట్లాడుతూ, కేసులు పెరిగిన తర్వాత స్పందించే ధోరణి వద్దని, కేసులు పెరగకుండా ముందే అప్రమత్తం కావాలని ఆదేశించారు. మలేరియా ప్రభావిత గిరిజన, మారుమూల ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించాలని, దోమల నియంత్రణ చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆయన సూచించారు.