శ్రీకాకుళంలో మొగలి పూల సాగు: లీటర్ నూనె ధర ఏకంగా నాలుగు లక్షలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Srikakulam
శ్రీకాకుళం జిల్లాలో పెట్టుబడి లేని మొగలి పూల సాగు రైతుల పంటను సిరుల పంటగా మారుస్తోందని అధికారులు తెలిపారు. ఎలాంటి ఎరువులు, సాగు నీరు అవసరం లేని ఈ మొగలి చెట్ల నుంచి తీసే అత్తరు నూనెకు మార్కెట్లో లీటర్కు నాలుగు లక్షల రూపాయల వరకు ధర పలుకుతోంది. తీర ప్రాంత మండలాల్లో సుమారు ఆరు వేల హెక్టార్లలో ఈ సాగును విస్తరించి రైతులు భారీగా లాభాలు ఆర్జిస్తున్నారని వ్యవసాయ నిపుణులు పేర్కొన్నారు.