పోషకాహార నాణ్యతను పరిశీలించిన బీజేపీ నేతల అంగన్వాడీ కేంద్రాల పర్యటన

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఆలూరు

కర్నూలు జిల్లా ఆలూరు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బీజేపీ నేతలు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పోషకాహార నాణ్యతను పరిశీలించారు. సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా పిల్లలు, గర్భిణీలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొనసాగిస్తామని ఆలూరు మండల అధ్యక్షులు కురువ బొగ్గురు బసవరాజు తెలిపారు.