పులివెందులలో అల్లర్లకు జగన్ మోహన్ రెడ్డి కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ వర్ల రామయ్య
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Vijayawada
పులివెందులలో ఎన్నికలను భగ్నం చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి హింసాకాండకు పాల్పడ్డారని టీడీపీ ఎమ్మెల్సీ వర్ల రామయ్య మంగళగిరిలో ఆరోపించారు. ఓటమి భయంతోనే బయటి వ్యక్తులను రప్పించి దొంగ ఓట్లకు యత్నించారని, పోలీసుల అడ్డుకోవడంతో ఉద్రిక్తత సృష్టించేందుకు స్వయంగా కార్లకు నిప్పు అంటించుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్ కు వినియోగించుకుంటున్నారని స్పష్టం చేశారు.