పీఎం అజయ్ పథకంతో మారనున్న రామాజీపేట గ్రామం రూపురేఖలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: యాదగిరిగుట్ట

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం అజయ్ పథకానికి యాదగిరిగుట్ట మండలంలోని రామాజీపేట గ్రామం ఎంపికైంది. ఈ పథకం ద్వారా ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాల్లో మౌలిక వసతులు, రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి అభివృద్ధి పనుల కోసం ఇరవై లక్షల రూపాయల నిధులు మంజూరు కానున్నట్లు అధికారులు తెలిపారు.