కార్మికులు, రైతులు ఐక్యంగా పోరాడాలని సీపీఐ(ఎంఎల్) పిలుపు

రిపోర్టర్: కృష్ణ స్థలం: నారాయణపేట

నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం బిజ్వార్‌లో నిర్వహించిన సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాజకీయ శిక్షణ తరగతుల్లో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.కృష్ణ మాట్లాడారు. సామ్రాజ్యవాదం, బడా పెట్టుబడిదారుల దోపిడీకి వ్యతిరేకంగా కార్మికులు, రైతులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలు అందడం లేదని, పాలకులు బడా వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.