డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ ఛాంపియన్ కార్మెల్లాకు ప్రాణాంతక క్యాన్సర్ ముప్పు

రిపోర్టర్: శివ స్థలం: New York

డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ మహిళా ఛాంపియన్ కార్మెల్లా తనకు వంశపారంపర్యంగా లించ్ సిండ్రోమ్ ఉన్నట్లు తాజా పాడ్కాస్ట్ లో వెల్లడించారని వైద్య నిపుణులు తెలిపారు. ఈ జన్యుపరమైన పరిస్థితి కారణంగా భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్తు కోసమే తాను పరీక్షలు చేయించుకున్నట్లు చెప్పి తీవ్ర ఆందోళన చెందారు. అయితే తదుపరి వైద్య పరీక్షల్ లో ఎలాంటి సమస్య లేదని తేలడంతో ఆమె ఊపిరి పీల్చుకున్నారు.