రామాయణంలో సీత పాత్రపై కేబీకే షోలో నటి సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు
రిపోర్టర్: మహేష్
స్థలం: ముంబై
బాలీవుడ్ ప్రముఖ రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్ పతి వేదికగా నటి సాయిపల్లవి రామాయణ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని నిర్వాహకులు తెలిపారు. రాబోయే పౌరాణిక చిత్రం రామాయణంలో సీతాదేవి పాత్రలో నటిస్తున్న తాను, ఆ పవిత్రమైన పాత్ర కోసం ఎలాంటి సొంత ఆలోచనలు ఉపయోగించకుండా సీతమ్మ ఆశీర్వాదాలతోనే నటించానని ఆమె స్పష్టం చేశారు. ఈ క్రమంలో అమితాబ్ బచ్చన్ సమక్షంలో సీత పాత్రపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.