ఢిల్లీలో బాణసంచా ఆంక్షల ఉల్లంఘనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: న్యూఢిల్లీ
దీపావళి సందర్భంగా ఢిల్లీలో బాణసంచా విక్రయాలపై విధించిన ఆంక్షలు అమలవుతున్న తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలను ఉల్లంఘించి టపాసులు విక్రయిస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. కోర్టు ఆదేశాలు కేవలం కాగితాలకే పరిమితం కాకూడదని, క్షేత్రస్థాయిలో కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ పీబీ వరాలేతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు.