పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం: జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్ ప్రారంభం
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార రథాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రారంభించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించారు. హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్ వాహనాన్ని ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ గడల శ్రీనివాసరావుకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారానికి ఈ ప్రచార రథం ఒక ప్రజాసేవా వేదికగా నిలవాలని ఆయన స్పష్టం చేశారు.